ఇంగ్లండ్‌తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి […]
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని విశాఖలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం, […]
మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని సావ్నర్ అనే పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలితో శృంగారం చేస్తూ అజయ్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు ఆమెతో కలిసి లాడ్జికి వెళ్లిన అతడు.. సెక్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో ప్రియురాలు లాడ్జీ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. అయితే అప్పటికే అజయ్ చనిపోయినట్లు లాడ్జీ సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా పోస్టుమార్టం చేసిన డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సంబంధిత సమస్యతో చనిపోయినట్లు నిర్ధారించారు. […]
గుంటూరు టీడీపీ లోక్‌సభ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ ఆధ్వర్యంలోని అమరరాజా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ కంపెనీ తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా 500 బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో అమరరాజా కంపెనీ నిలిచింది. ఈ విషయాన్ని అమరరాజ గ్రూప్ మంగళవారం స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రజల విలువ తెలిస్తే పోటీలో ముందుంటామన్న విషయాన్ని తాము నమ్ముతామని.. విశ్వాసం, గౌరవం అన్నవే ఆ […]
కాకినాడ జిల్లాలో మంగళవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో రోడ్డు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు తాము పెట్టిన చిన్న బచ్చా గాళ్లు అని.. వాళ్లు తమ మీద పెత్తనం చెలాయిస్తున్నారని చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. మీకు నచ్చకపోతే తీసేయండి అంటూ కార్యకర్తలకు సూచించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌లోకి తీసుకుని నడిపించాలి.. మిమ్మల్ని ఎవరూ వద్దని […]
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. తొలిసారిగా 350కి పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లీష్ జట్టు మరో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే కొట్టేసింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో 100కు పైగా పరుగుల ఆధిక్యాన్ని పొంది టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా […]
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది. Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్ […]
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల జగడం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారి ఈఎన్‌సీ మురళీధర్ రెండు లేఖలు రాశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై లేఖలో అభ్యంతరం తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని ఈ లేఖలో […]
డ్రైవర్ లేకుండానే వాహనాలు నడిపే విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇండియాలోనే మొదటిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే కారు టెస్ట్ రన్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహించింది. ఇందుకోసం మలుపులు, స్పీడ్‌బ్రేకర్లు లేకుండా 2 కిలోమీటర్లు పొడవైన ట్రాక్ నిర్మించింది. కేంద్రమంత్రి జితేంద్రసింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్ లేకుండా 2 కిలోమీటర్ల పాటు ఈ కారును నడిపించి పరీక్షించారు. ఇటువంటి ప్రయోగం దేశంలోనే మొదటిది. […]
అన్ని విషయాల్లో పురుషులు, మహిళలు సమానమే అని చెప్తుంటారు. కానీ పాటించరు. ఉదాహరణకు క్రికెట్ విషయానికి వస్తే పురుషులకు ఒకలా.. మహిళలకు మరోలా వేతనాలు ఇస్తున్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అన్ని జట్లు పురుషులు జట్టుకు, మహిళల జట్టుకు సమానంగా వేతనాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే క్రికెట్‌లో పురుషుల క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మహిళల క్రికెట్‌కు లేదనేది జగమెరిగిన సత్యం. అయితే గతంలో కంటే మహిళల క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అందుకే ఐపీఎల్ […]