గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్‌లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో రోహిత్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
Read Also: ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
కరోనా నుంచి కోలుకున్న అనంతరం భారత్ తరపున ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. కీలకమైన ఇంగ్లండ్ టెస్టులో ఆడకపోవడం బాధాకరమేనని.. అయితే కొన్ని తమ నియంత్రణలో ఉండవని అభిప్రాయపడ్డాడు. దేశం కోసం ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకూడదని తాను కోరుకుంటానని చెప్పాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా వచ్చే టీ20 ప్రపంచకప్ టీం ఓ కొలిక్కి వస్తుందని తెలిపాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్ ప్రపంచకప్ కోసం తమ దృష్టిలో ఉన్నాడని రోహిత్ శర్మ వివరించాడు.
తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్