IND Vs SL: గౌహతి వేదికగా టీమిండియాతో జరగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తుది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లను తీసుకోలేదు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోగా.. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ […]
Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తన తండ్రి టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలవడంపైనా క్లారిటీ ఇచ్చారు. కేశినేని నాని కుమార్తె పెళ్లికి తన తండ్రి వసంత నాగేశ్వరరావు వెళ్లలేకపోయారని.. పెళ్లికి వెళ్లలేదు కాబట్టే కర్టసీగా కేశినేని నానిని పలకరించడానికి వెళ్లారని తెలిపారు. కేశినేని నానితో తన తండ్రి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. మరోవైపు తన […]
Pathaan Trailer: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి అభిమానుల సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర మూవీలో అతిథి పాత్రలో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు ‘పఠాన్’ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌గా తెరకెక్కిన పఠాన్ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగులోనూ ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగా […]
Vijayawada: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని […]
Kantara Movie: గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ మూవీని నిర్మించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా […]
T20 League: టీ20 క్రికెట్‌లో మరో లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్‌లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్‌కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు […]
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి అభిమానులను అలరించబోతున్నాడు. అఖండ వంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఇటీవల ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం […]
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలిసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని […]
BSNL New Plan: ఇటీవల కాలంలో మొబైల్ ప్లాన్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ కావాలంటే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు నెలకు రూ.300 బిల్లు వేస్తున్నారు. దీంతో మూడు నెలలకు రూ.900, ఆరు నెలలకు రూ.1500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం మంచి ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లో డేటా లేనిదే నడవని ఈరోజుల్లో కేవలం రూ.997కే […]
Telugu Desam Party: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీనోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్ర […]