Suzuki 350cc Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. 350 సీసీ బైక్‌ను విడుదల చేస్తోన్న సుజుకీ!
- 350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్
- 350cc విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం
- ఎన్‌ఫీల్డ్‌ను ఢీకొట్టడానికి సిద్ధమవుతోన్న సుజుకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
350cc బైక్‌లకు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. భారత ఆటో మార్కెట్‌ను 350cc బైక్‌లు రారాజుగా ఉన్నాయి. యూరప్, ఆసియా వంటి ప్రధాన మార్కెట్‌లలో కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అయితే భారతదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా ఎంపికలు (బైక్స్) లేవు. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ ప్రస్తుతం 350cc విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లు. ఈ రెండింటికి గట్టి పోటీని ఇచ్చే మరో బైక్ భారతదేశంలో లేదు. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను ఢీకొట్టడానికి ‘సుజుకీ’ సిద్ధమవుతోంది.
సుజుకీ కంపెనీ 350cc విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ బైక్‌లను భారత్ కంటే ముందే యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. 350-500cc బైక్‌ల కోసం ఇప్పటికే ఉన్న 398cc, ఫ్యూయల్-ఇంజెక్ట్ , సింగిల్-సిలిండర్ ఇంజిన్ కొత్త వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఇంజిన్ ఇప్పటికే యూరో 5+ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది 37.5 bhpని ఉత్పత్తి చేస్తుంది. ఇది యూరప్‌లోని A2 లైసెన్స్ అవసరాలను అనుగుణంగా ఉంది. ఈ ఇంజిన్ ఇప్పటికే సుజుకి DR-Z4S, DR-Z4SM బైక్‌లలో ఉపయోగించారు. గత కార్బ్యురేటర్ సెటప్‌తో పోలిస్తే.. ఈ సరికొత్త ఇంజిన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్, డ్యూయల్ స్పార్క్ ప్లగ్‌లు సహా రైడ్-బై-వైర్ థ్రోటిల్‌ను కలిగి ఉంది. అధిక కామ్ లిఫ్ట్‌తో ఈ ఇంజిన్ సున్నితమైన పనితీరును అందిస్తుంది.
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
యూకే డేటా ప్రకారం.. అక్టోబర్ 2025లో 126-500cc బైక్‌ల అమ్మకాలు 1,416 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 51-125cc సెగ్మెంట్ తర్వాత రెండవ అత్యధిక అమ్మకాలు. అక్టోబర్‌లో ‘ఆధునిక క్లాసిక్’ బైక్ BSA బాంటమ్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్. మొత్తం అమ్మకాలు 87 యూనిట్లు కాగా.. ఇది యూకేలో 126-500cc సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌గా నిలిచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. విదేశీ మార్కెట్లలో కూడా పట్టు సాదించేందుకు ప్రయత్నిస్తోంది. ట్రయంఫ్ 400cc బైక్‌లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. అక్టోబర్‌లో ట్రయంఫ్ 400cc బైక్‌లు 350cc-450cc విభాగంలో 4.53 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. జావా యెజ్డి BSA 6,922 యూనిట్లను విక్రయించింది. మార్కెట్ వాటా 5.10 శాతంగా ఉంది. క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, మెటియోర్ 350 వంటి ఉత్పత్తులతో రాయల్ ఎన్ఫీల్డ్ ఈ విభాగంలో ముందంజలో ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు