Kantara Movie: గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ మూవీని నిర్మించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేయగా మంచి లాభాలను అందించింది.
Read Also: Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. తాజాగా కాంతార సినిమా ఆస్కార్‌కు క్వాలిఫై అయ్యిందని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్‌కు క్వాలిఫై అయ్యిందని తెలిపింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గానూ కాంతార సినిమా 95వ ఆస్కార్‌కు క్వాలిఫై కావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.