BSNL New Plan: ఇటీవల కాలంలో మొబైల్ ప్లాన్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ కావాలంటే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు నెలకు రూ.300 బిల్లు వేస్తున్నారు. దీంతో మూడు నెలలకు రూ.900, ఆరు నెలలకు రూ.1500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం మంచి ఆఫర్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లో డేటా లేనిదే నడవని ఈరోజుల్లో కేవలం రూ.997కే 160 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తామని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. అంటే 5 నెలలకు దాదాపు వెయ్యి రూపాయలకే రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది.
Read Also: Lips Care: చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి
ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా చొప్పున 160 రోజుల పాటు 320 జీబీ అందిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అటు మరో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ లెక్క ప్రకారం 1 జీబీ డేటా కేవలం రూ.3.11కే లభిస్తోంది. లాంగ్ ప్లాన్ కోసం చూసే వినియోగదారులు ఈ ఆఫర్ పొంది లాభపడవచ్చు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ పలుచోట్ల 4జీ సేవలను అందిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు విస్తరించనున్నాయి. వచ్చే ఏడాది 5జీ సేవలను కూడా అందిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.