IND Vs SL: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ […]
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ * తిరుమల: నేడు ఉ.9 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల.. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు సంబంధించిన టిక్కెట్ల కోటా విడుదల * విశాఖ: నేటి నుంచి సింహాచల దేవస్థానంలో ధారోత్సవాలు.. ఈనెల 13 వరకు ఆర్జిత నిత్య కళ్యాణం రద్దు * నేటి నుంచి […]
Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో […]
Sajjala: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తుపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారని.. జగన్ పూర్తి కాలం పాలిస్తారని […]
Ram Gopal Varma: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. కేవలం డబ్బులు కోసం పవన్ తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని అస్సలు ఊహించలేదని వర్మ అన్నాడు. దీంతో ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ సోషల్ మీడియాలో వర్మ ట్వీట్ చేశాడు. అయితే వర్మ ట్వీట్‌పై జనసేన […]
YSRCP: వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. జగన్ […]
BCCI: రోడ్డుప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. ఈ సీజన్‌లో పంత్ ఆడకపోయినా పూర్తి జీతం అందించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఏ గ్రేడ్ ఆటగాడైన పంత్‌కు ఏడాదికి రూ.5 కోట్లు లభిస్తాయి. ఈ మొత్తాన్ని బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్‌కు రావాల్సిన రూ.16 కోట్లను నిబంధనల ప్రకారం జట్టుతో ఒప్పందం చేసుకున్న […]
KE Kumar: తమిళనాడులో జరుగుతున్న జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లో విషాదం చోటు చేసుకొంది. వెటరన్ రేసర్ కేఈ కుమార్ (59) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. రెండో రౌండ్ పోటీల్లో భాగంగా మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడి వాహనాన్ని ఢీకొట్టి ట్రాక్ నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారులో నుంచి కేఈ కుమార్‌ను బయటకు […]
Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడినట్లు నిర్మాత దిల్ రాజు […]
Andhra Pradesh Winter: దక్షిణ భారతదేశం మొత్తం చలి విజృంభిస్తోంది. దీంతో సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చలి తీవ్రస్థాయిలో ఉంది. చింతపల్లిలో ముఖ్యంగా 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు హుకుంపేటలో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని లంబసింగి వంటి కొన్ని ప్రాంతాల్లో […]