SA T20 League: నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 League: టీ20 క్రికెట్‌లో మరో లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్‌లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్‌కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఎస్ఏ20 లీగ్‌లో సత్తా చాటనున్నారు.
Read Also: Balakrishna: బాలయ్య వాచీ చూశారా? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా?
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
సఫారీ టీ20 లీగ్‌లో దాదాపు ఐపీఎల్ ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఐపీఎల్ మాదిరే పేర్లు కూడా ఉన్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలి సీజన్ బరిలో దిగుతున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లన్నీ ముగిసే నాటికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు వచ్చే నెల 11న జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఐపీఎల్ తరహాలో ఎస్ఏ 20 లీగ్‌కు ఆదరణ దక్కుతుందో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!