Andhra Pradesh: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డికి జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఆయన్ను జిల్లా నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ కలెక్టర్ గిరీష ఆదేశాలు జారీ చేశారు. కురబలకోటలో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన కొండ్రెడ్డికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ సమర్పించిన నివేదిక ఆధారంగా కొండ్రెడ్డిపై చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. కొండ్రెడ్డిని తరచూ గొడవలకు దిగే […]
Sankranti Festival: ఈ సంక్రాంతికి చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి వెళ్లాలని నారా, నందమూరి కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. గత మూడేళ్ల నుంచి కరోనా కారణంగా స్వగ్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లె వెళ్లాలని చంద్రబాబు కుటుంబం డిసైడ్ అయ్యింది. తన బావ కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలను ఆస్వాదించనుంది. ఈ మేరకు బాలయ్య తన భార్య వసుంధరతో పాటు […]
Nellore District: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ వివాదం కలకలం రేపుతోంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తమను నమ్మించి మోసం చేశారని శివచరణ్‌రెడ్డి తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. ఇటీవల తనకు కొడుకు ఎవరూ లేరని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘నేను ఎవరిని?’ అంటూ శివచరణ్ రెడ్డి ఒక లేఖను విడుదల చేయడంతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో చిన్నతనంలో తీసుకున్న ఫోటోలను విడుదల చేశారు. శివ చరణ్ రెడ్డితో తనకు ఎలాంటి […]
What’s Today: * తిరుమల: నేడు రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల.. ఈనెల 12 నుంచి 31 వరకు సర్వదర్శన టిక్కెట్లు జారీ * నేడు శ్రీశైలం రానున్న పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి * ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. హిందూపురంలో ఇవాళ జరిగే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొననున్న గిడుగు రుద్రరాజు * నేడు మెదక్ జిల్లాలో మంత్రి […]
Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్‌లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ […]
Minister AppalaRaju: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళంలో జరిగే సభ స్క్రిప్ట్ కోసం చంద్రబాబును పవన్ కలిశాడని ఆయన ఆరోపించారు. బీజేపీతో పొత్తులో ఉండి తన రేటు పెంచుకోవడానికే చంద్రబాబును పవన్ కలిశాడని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. పవన్ తనను నమ్మిన వారిని ముంచేస్తున్నాడని.. ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కలయికలో ఆశ్చర్యం ఏం లేదన్నారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము టీడీపీ, […]
WTC Final: ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఒక బెర్తు ఖరారైంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టును ఆస్ట్రేలియా డ్రాగా ముగించడంతో ఆ జట్టుకు ఫైనల్ బెర్తు దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో బెర్తు కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ప్రస్తుతానికి పాయింట్ల టేబుల్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. త్వరలో […]
Health Tips: సాధారణంగా డ్రైఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో పుష్కలంగా పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందుకోసం రాత్రంతా ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తినడం వల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. నానబెట్టిన ఖర్జూరాలలో ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా […]
Potina Mahesh: వైసీపీ నేతలపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం జరిగిందో అంబటి చూశాడా అని ప్రశ్నించారు. లోపలకు వెళ్లి సోఫాల కింద దూరి విన్నావా అంబటి అని నిలదీశారు. బాబు-పవన్ కలిస్తే వైసీపీ నేతలకు ఎందుకు భయం అని సూటి ప్రశ్న వేశారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, కారుమూరు నాగేశ్వరరావు జగన్ చెప్పు చేతల్లో పని […]
Viral Video: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 11, 12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగనుంది. ‘మధ్యప్రదేశ్-ది ప్యూచర్ రెడీ స్టేట్’ పేరుతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం హాజరుకానున్నారు. అంతేకాకుండా రిలయన్స్, టాటా, అదానీ, బిర్లా వంటి 70 మంది వ్యాపారవేత్తలు రానున్నారు. ఈ మేరకు రోడ్ల పక్కన డివైడర్లపై గడ్డి […]