Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి అభిమానులను అలరించబోతున్నాడు. అఖండ వంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలవుతోంది. ఇటీవల ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం అందరిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలో బాలయ్య వేసుకున్న డ్రెస్, ఆయన ధరించిన వాచీ అందరి దృష్టిని ఆకర్షించాయి.
Read Also: Andhra Pradesh: టీడీపీ ఎంపీ కేశినేని నానిని కలిసిన వసంత నాగేశ్వరరావు
ముఖ్యంగా బాలయ్య ధరించిన వాచీ ఆకట్టుకుంది. 1847 ప్యారీస్‌లో ఈ వాచీని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమట. అందుకే ఆ వాచీని తాను స్పెషల్‌గా భావించిన సందర్భాలలో మాత్రమే ధరిస్తూ ఉంటానని స్వయంగా బాలయ్య వెల్లడించాడు. ఈ వాచీని ఆయన కూతురు బ్రాహ్మణి గిఫ్టుగా ఇచ్చిందని టాక్ నడుస్తోంది. దీంతో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ తన చేతికి పెట్టుకున్న కార్డియార్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఈ వాచీ గురించి తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో వివరాలను సెర్చ్ చేస్తున్నారు.