సినిమా సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి టూ ఇయర్స్ తీసుకున్న వంశీ.. మహర్షిని దింపడానికి మూడేళ్లు పట్టింది. మహర్షి నుండి వారిసుకు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి.. ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే.. వారిసు తర్వాత నెక్ట్స్ ఏం మూవీ చేస్తున్నాడో..? ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్నా మధ్య సల్మాన్‌ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ.. కాదన్నది మరో వాదన.
వివేక్ ఆత్రేయ : అంటే సుందరానికి మూవీతో నానికి సరైన హిట్ ఇవ్వలేకపోయానని కసిమీద వర్క్ చేసి సరిపోదా శనివారంతో లెక్కలు సరిచేశాడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడో క్లారిటీ లేదు. సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాకైతే కోలీవుడ్‌లో స్ప్రెడ్ అయ్యింది కానీ.. ట్రాక్ ఎక్కేంత వరకు డౌటే.
శౌర్యువ్ : హాయ్ నాన్నతో నానిని ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువ చేసిన శౌర్యువ్ కూడా భారీ గ్యాపే తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతడి సెకండ్ ఫిల్మ్ ఏంటో అప్డేట్ లేదు. మళ్లీ తిరిగి నాని దగ్గరకే వచ్చినట్లు సమాచారం.
Also Read : Preity Mukhundhan : ప్లాప్స్ హీరోపైనే ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్
కొరటాల శివ : ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా రూ. 500 కోట్లు టేస్ట్ చేశాడు కొరటాల. దేవర2 ఉంటుందని ఎనౌన్స్ చేశారు కూడా. కానీ తారక్ కమిట్మెంట్స్, లైనప్ వల్ల సినిమా ఉందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఉందని కొన్ని సార్లు.. లేదు షెడ్డుకు వెళ్లిందని ఇంకొన్ని సార్లు న్యూస్ స్ప్రెడ్ కావడంతో కొరటాల మళ్లీ మెగాఫోన్ ఎప్పుడు పడతాడా అని చూస్తున్నారు ఆడియన్స్.
ప్రశాంత్ వర్మ : హనుమాన్‌తో తాను కూడా ఊహించని బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ ప్రకటించి సుమారు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లిన దాఖలాలు లేవు. రిషబ్ కాంతార2తో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్స్ ముందుకు సాగలేదని సమాచారం. దీని కోసమే అధీర, మహాకాళి బాధ్యతలు మరొకరికి అప్పగించాడు ప్రశాంత్. తన డైరెక్షన్‌లో మోక్షజ్ఞ, రణవీర్ సినిమాలనుకుంటే ఏమయ్యాయో చెప్పనక్కర్లేదు.
నాగ్ అశ్విన్ : కల్కి2కి లీడ్ ఇచ్చి కల్కిని ఇన్ కంప్లీట్ చేశాడు నాగ్ అశ్విన్. కానీ కల్కి2 కోసం స్టోరీని రెడీ చేసినా కూడా డేట్స్ కేటాయించలేకపోతున్నాడు డార్లింగ్. రాజా సాబ్ పోస్ట్ పోన్, ఫౌజీ షూటింగ్.. ఇప్పుడే మొదలైన స్పిరిట్.. కల్కి2 కన్నా ముందుగా వెయిట్ చేస్తున్న సలార్ సీక్వెల్ డార్లింగ్ లైనప్‌లో ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో నాగ్ అశ్విన్ కి ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తాడో తెలియని సిచ్యుయేషన్. దీంతో మెగాఫోన్ పట్టేందుకు నాగ్ అశ్విన్ కి గ్యాప్ వచ్చేట్లుగానే కనిపిస్తోంది.
సాయి రాజేష్ : ఇక బేబితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేష్ కూడా మళ్లీ కెమెరా టచ్ చేయలేదు. బేబిని హిందీలో రీమేక్ చేద్దామని అనుకుంటే.. హీరో పేచీ పెట్టుకోవడంతో ఆగింది.