టాలీవుడ్‌లో ‘బేబమ్మ’గా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కృతి శెట్టి, ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ చిన్నది, ఆ తర్వాత స్పీడ్ స్పీడ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. అయితే, ఎంత వరుస చిత్రాలు చేసిందో అంతే ఫ్లాపులు పడటంతో ఈ యంగ్ బ్యూటీ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ మరియు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాటిని గుర్తు చేసుకుంటూ కృతి ఎమోషనల్ అయ్యింది.
Also Read : Eesha Trailer: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘ఈషా’ ట్రైలర్..!
‘చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడం, వచ్చీ రాగానే భారీ హిట్ పడటంతో అంతా బాగుంది అనుకున్నాను. కానీ ఆ తర్వాత వరుస విమర్శలు, నెగిటివిటీని ఎదుర్కోవడం మానసికంగా నన్ను చాలా కుంగదీశాయి. నేను నా వంతుగా బెస్ట్ ఇస్తున్నా కూడా ఏదో ఒక కారణంతో నన్ను టార్గెట్ చేయడం బాధ కలిగించింది’ అంటూ కృతి కన్నీళ్లు పెట్టుకుంది. ఆలాంటి క్లిష్ట సమయంలో నా తల్లి మరియు స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ వల్లే నిలబడగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే,
కెరీర్ పరంగా ఎదురైన వరుస ఫ్లాపులు మరియు పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా, ప్రస్తుతానికి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే మంచిదేమోనని అనిపిస్తోంది కృతి అభిప్రాయం బయటపెట్టింది. అనుభవం లేకపోవడం వల్లే వరుసగా సినిమాలు సంతకం చేశానని, ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించానని ఆమె తెలిపింది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హీరోయిన్.. ఆ స్థాయిని కాపాడుకోలేకపోయినప్పుడు వచ్చే ట్రోల్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో కృతి మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ చిన్న బ్రేక్ తర్వాత మన ‘బేబమ్మ’ మళ్ళీ పుంజుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి!