హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పిరికిపిందల చర్య.. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నానని అన్నారు.
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
హనుమకొండ జిల్లా హయగ్రీవ గ్రౌండ్‌లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరంగల్‌కి 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది ప్రభుత్వం.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో.. ఫార్ములా ఈ- రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అన్నారు.
ఫార్ములా-ఈ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన అంశాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో నుంచి భారీగా ఎన్నికల బాండ్లు అందినట్లు తెలిపింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లు అందాయని.. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని వెల్లడించింది.
మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చిన కేటీఆర్... అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.. తన లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 40 నిమిషాల పాటు పోలీసులు, కేటీఆర్ టీమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జల జప దీక్ష చేసిన రవీంద్రజిత్ టీమ్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జడికేటర్ స్వర్ణ శ్రీ సర్టిఫికెట్ అందించి అభినందించారు.