మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప మనసుతో రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లలో దుర్గంధంతో ఉండేవి.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్‌లను నిర్మిస్తున్నారని అన్నారు. రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారని చెప్పారు.
చర్లపల్లి పారిశ్రామిక వాడకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈటల పేర్కొన్నారు.
Stella Ship: ఎట్టకేలకు కాకినాడ నుంచి బయల్దేరిన స్టెల్లా ఎల్ షిప్!
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కొత్త టెర్మినల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మనం అందరం కోరాం.. కానీ గత ప్రభుత్వం సంకల్పం చేసిందో లేదో గాని, శాసన సభ్యులు అనేకమంది ప్రయత్నం చేశారన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కి అప్రోచ్ రోడ్డు, విమానాశ్రయం రోడ్‌లు లాగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అప్రోచ్ రోడ్డు కోసం కేంద్ర నిధుల నుంచి సహాయం అందజేయాలని తమ ప్రభుత్వం కూడా కోరుతోందన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్డీఏ రాకముందే రైల్వే స్టేషన్‌లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. ఒక ప్రణాళికా బద్ధంగా మూడు రంగాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైల్వే, రోడ్డు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 32 వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. 2 వేల కోట్లతో అమృత్ స్కీం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ. 430 కోట్లతో ఆత్యాధునిక టెర్మినల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని బండి సంజయ్ తెలిపారు.
China Virus: బెంగళూరులోనే రెండు కేసులు.. HMPV వైరస్గా నిర్ధారణ
కేంద్ర సహాయ మంత్రి సోమన్న మాట్లాడుతూ.. రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధికి ఖర్చు చేస్తోందని తెలిపారు. అమృత్ భారత్ స్కీం కింద అనేక రైల్వే స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేశాం.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ 4Th టెర్మినల్‌గా అభివృద్ధి చేశామన్నారు. ఈ కొత్త టెర్మినల్ రావడంతో హైదరాబాద్‌లో చాలా వరకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పుతాయని చెప్పారు. న్యూ ట్రైన్స్ త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి.. అప్రోచ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.. ఇది గమనించాలని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. మోడీ స్వప్నం.. రైల్వే అభివృద్ధి చేయాలని అన్నారు.