హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేద పిల్లలకు బువ్వ పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని ఆరోపించారు. అందుకే 200 శాతం మెస్ ఛార్జీలు పెంచామన్నారు. అంతేకాకుండా.. ఆర్టీసీ దండగన్నారు, ఆర్టీసీ కార్మికులను విస్మరించారు.. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: ఆర్టీసీ ప్రజలది.. కాపాడుకొని ముందుకు తీసుకుపోవాలి
వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్ అంటే… ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. తాము చేసే మంచి పనులను ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. సంక్రాంతి తర్వాత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం.. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యం అని చెప్పారు. నాడు పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వారికే ఇళ్లు ఇచ్చారు.. కానీ తాము పార్టీలకు, కులాలు మతాలకు అనుగుణంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్ల తర్వాత కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమేనన్నారు.
Read Also: HMPV Virus: భారత్లో విజృంభిస్తున్న HMPV వైరస్.. గుజరాత్‌లో మరో కేసు..
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు అచ్చొచ్చిన ఆంబోతులా ప్రవర్తించారని పేర్కొన్నారు. మరోవైపు.. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుచేసి దోచుకుంటే తాము 6500 కోట్ల రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా అచ్చొచ్చిన కుర్ర ఆంబోతులను పంపిస్తున్నారు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ డోర్ క్లోజ్ అవుతుందని విమర్శించారు. పంట పండించే ప్రతీ గుంటకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.