హనుమకొండ జిల్లా హయగ్రీవ గ్రౌండ్‌లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరంగల్‌కి 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది ప్రభుత్వం.. మొదటి దశగా ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. సంక్రాంతి లోపు మరో 25 బస్సులు రోడ్డెక్కనున్నాయి.. అంతరం మిగిలిన బస్సులను ప్రారంభించనున్నారు.
Stock Market Crash: స్టాక్ మార్కెట్స్పై చైనా వైరస్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. మహిళలు 4350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారని అన్నారు. ఆక్యుపెన్సీ గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుంది.. వారు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఆర్టీసీ ఉద్యోగులు.. బస్ కా పెయ్య నై చెలిగ అనే ఉద్యమాన్ని చేపట్టారని అన్నారు. వారికి 2013 బాండ్స్ ఇచ్చాం.. 21 శాతం పీఆర్సీ ఇచ్చాం.. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం.. 3 వేల ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని చెప్పారు. ఆర్టీసీ ప్రజలది.. ఆర్టీసీని కాపాడుకొని ముందుకు తీసుకుపోయి బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్‌లో ప్రజల కోసం ఆర్టీసీ మరిన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
CM Revanth: రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్య శ్రీ 5-10 లక్షలు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, 2 లక్షల రైతు రుణమాఫీ, 40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా 12 వేలు ఇస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ యోజన రూల్స్ రైతు భరోసాకి పెడితే ఎవరికి రాదని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం.. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వెల్లడించారు.