చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుంది.. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉందని చెప్పారు. అంతేకాకుండా.. ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Read Also: Supreme Court: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ..
మరోవైపు.. రీజినల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోంది.. రీజినల్ రైల్ అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. రైల్ రింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణంకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని ప్రధాని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందని పేర్కొన్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 1 ట్రిలియన్ ఎకానమి కాంట్రిబ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Game Changer: యువకుల మృతి బాధాకరం.. ఆర్థికసాయం అందిస్తాం: పవన్ కల్యాణ్