తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా.. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
రేపు మధ్యాహ్నం (శుక్రవారం) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. రేపు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సీతా రామ చంద్రస్వామి వారికి.. ఈరోజు సాయంత్రం గోదావరిలో హంస వాహన సేవ కొనసాగనుంది. సాయంత్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకుంటాయి. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారి వేంచేసి.. గోదావరిలో విహరించుతారు.
"భూభారతి" చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో.. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్‌కు ఊరట లభించలేదు.. అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను దుయ్యబట్టారు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.