పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళన జరగాలన్నారు మంత్రి.. ఈ క్రమంలో.. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.
2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని మరింత నమ్మేలా చాహల్, ధనశ్రీ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుండి ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.. 11 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు రిక్షావాడు. రిక్షాలో తన ఇంటికి తీసుకువెళ్లి బలాత్కారం చేయబోయాడు రిక్షావాడు (70) కోపెలా బాల స్వామి. బాలిక తల్లిదండ్రులు విజయవాడ పంజా సెంటర్‌లో పాత బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఆ కుటుంబం విజయవాడ వాగు సెంటర్‌లో నివాసం ఉంటున్నారు.
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్‌ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు.
చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా.. ఎటువంట అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండగ దృష్ట్యా.. 7,200 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది.
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో 'జన నాయకుడు' వెబ్సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.