హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేయటం తగదన్నారు.
Read Also: Delhi Assembly Elections: ఢిల్లీలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికలు ఎప్పుడంటే..!
ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తగ్గట్లుగా మాట్లాడటం అలవాటన్నారు. ఆమె మరిది చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటానికే తరచూ ఆమె మాట్లాడుతున్నారని అందరికీ తెలుసని విమర్శించారు. ఆమెకు గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు తప్పిదం వల్ల మనుషుల ప్రాణాలు పోయింది కనిపించలేదని.. కృష్ణ పుష్కరాల సమయంలో 40కి పైగా ఆలయాలు కూలగొట్టింది గుర్తు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో అర్చకులకు వేతనాలు పెంచామని.. ఏపీలో పలు ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయాన్ని వివాదం చేయాలని చూసినా ఏమీ చేయలేకపోయారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
Read Also: MG Windsor EV Price: పెరిగిన ఎంజీ విండ్‌సోర్ ఈవీ ధర.. లేటెస్ట్ రేట్స్ ఇవే!