Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shri Krishna Jala Japa Deeksha Created A Record On Dwarka Sea

Jai Dwarka Campaign: ద్వారకా స‌ముద్రంపై రికార్డు సృష్టించిన ‘శ్రీకృష్ణ జల జప దీక్ష’..

NTV Telugu Twitter
Published Date :January 6, 2025 , 11:34 am
By Rajesh Veeramalla
  • ప్రాచీన ద్వారక నగరాన్ని పునరావిష్కరించేందుకు 'IT'S 6TH WOW' సంస్థ‌ కృషి
  • ద్వారకా స‌ముద్రంపై రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ జల జప దీక్ష
  • పరిశోధనల వివ‌రాలు తెలిపిన ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్
  • రవీంద్రజిత్ టీంకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స‌ర్టిఫికెట్ అంద‌జేత‌
  • ఫిబ్ర‌వ‌రిలో ద్వారకా స‌ముద్రంపై మ‌రో గిన్నిస్ రికార్డు.
Jai Dwarka Campaign: ద్వారకా స‌ముద్రంపై రికార్డు సృష్టించిన ‘శ్రీకృష్ణ జల జప దీక్ష’..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సముద్ర గర్భంలో ఉన్న పురాతన గుజ‌రాత్‌లోని ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన పరిశోధనలో అనేక‌ సంచలనాత్మక విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇట్స్ సిక్స్‌త్ వావ్ (IT’S 6TH WOW) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారక నగరంపై కొన్నేళ్లుగా చేస్తున్న ప‌రిశోధ‌న‌లు, కార్యక్రమాలు గుజ‌రాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రశంస‌లు కూడా పొందింది. ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం (World Sunken City Day) సందర్భంగా (డిసెంబర్ 21న‌) ద్వారకలో జై ద్వారకా క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన శ్రీకృష్ణ జల జప దీక్ష ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జల జప దీక్ష చేసిన రవీంద్రజిత్ టీమ్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జడికేటర్ స్వర్ణ శ్రీ సర్టిఫికెట్ అందించి అభినందించారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా స‌మావేశంలో ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ మాట్లాడుతూ.. ”డిసెంబర్ 21న‌ ద్వారకలో ‘జై ద్వారకా’ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం సంద‌ర్భంగా శ్రీకృష్ణ జల జప దీక్ష నిర్వహించాము. గుజ‌రాత్ పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖల‌ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజ‌య‌వంత‌మైంది. తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డుల్లో భాగమవ్వడం గర్వంగా ఉంది. ప్రాచీన ద్వారక నగరంను పునరావిష్కరించేందుకు, సముద్ర తలాలలో మళ్లీ తవ్వకాలను ప్రారంభించమని భారత ప్రభుత్వానికి వినతి చేయ‌డం ఈ శ్రీకృష్ణ జల జప దీక్ష ముఖ్య ఉద్దేశం. మా ‘ఇట్స్ సిక్స్‌త్ వావ్’ సంస్థ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించిన గుజ‌రాత్ ప్రభుత్వా, కేంద్ర ప్రభుత్వ టూరిజంకు కృత‌జ్ఞత‌లు తెలుపుకుంటున్నాం.” అని చెప్పారు.

Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో ఆరు రోజుల ప్రత్యేకతలు ఇవే..?

రికార్డు సృష్టించిన శ్రీకృష్ణ జల జప దీక్ష కార్యక్రమంలో జరిగిన ముఖ్య ఘట్టాలు
గ‌తంలో ప్రధాని న‌రేంద్ర మోదీ ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహించిన స్థలంలోనే.. రవీంద్రజిత్‌తో పాటు ఏడుగురు స్కూబా డైవర్లతో సముద్రంలో జల జప దీక్ష నిర్వహించారు. అదే స‌మ‌యంలో స‌ముద్రంపైన సగభాగం నీటిలో శ్రీకృష్ణ జల జప దీక్షలో 70 మంది పాల్గొన్నారు. సముద్ర గ‌ర్భంలోని పురాత‌న న‌గ‌రం కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు విజయవంతమవ్వాలని ఆశిస్తూ హవన పూజ నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారక న‌గ‌రంపై మ‌రోసారి అంద‌రి దృష్టిని నిలిపింది. సముద్రంలో అత్యధిక మంది డైవర్లు ఆధ్యాత్మిక సాధన చేసిన సంఘటనగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమం కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకృష్ణ ద్వారక కథ ఆధారంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

గిన్నిస్ రికార్డు
ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప‌రిశోధించి ప‌లు ఆధారాలు సేక‌రించారు ”ఇట్స్ సిక్స్‌త్ వావ్” సంస్థ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలో “జై ద్వారకా క్యాంపైన్‌”లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ఈ సంస్థ ప్రయ‌త్నిస్తోంది. ఈ క్రమంలో “ప్రపంచ పర్యాటక రేస్‌లైన్స్ డే” సందర్భంగా ఫిబ్రవ‌రి 17న‌ ద్వారకా స‌ముద్రం నీటిపై “జై ద్వారకా” లోగో రూపాన్ని700 మందితో రూపొందించ‌బోతున్నారు. ఈ ప్రయ‌త్నం గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును అందుకోబోతోంది. ఈ లోగో శ్రీ కృష్ణుని 7 నెమలి రెక్కలుగా, ప్రపంచంలోని 7 ప్రాచీన నాగరికతలను సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ చరిత్రకారుడు, ప్రపంచ పర్యాటక దినోత్సవ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) స‌భ్యుడు, మాడ్రిడ్-స్పెయిన్ జనరల్ సెక్రటరీ, ”ఇట్స్ సిక్స్‌త్ వావ్” జై ద్వారకా ప్రచార ఆర్గనైజర్ రవీంద్రజిత్, భారత భారతి జాతీయ అధ్యక్షుడు వినయ్ పాత్రలే, జై ద్వారకా ప్రచార ఆర్గనైజర్ & ఇట్స్ సిక్స్‌త్ వావ్ ప్రెసిడెంట్ షాహీ ఖాన్, జై ద్వారకా ప్రచార అంతర్జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ మీనాక్షి పద్మనాభన్, IT’S 6TH WOW ఇండియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కొండకింది, తెలంగాణ చైర్మన్ కలదర్ వల్లం, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జడికేటర్, కూచిపూడికి అంతర్జాతీయ రాయబారి స్వర్ణ శ్రీ, ఇంటర్నేషనల్ చైర్మన్ కిషోర్ పుల్ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dwarka sea
  • Guinness Record
  • IT'S 6TH WOW
  • Ravindrajit
  • record

తాజావార్తలు

  • TDP: జనంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. అంతర్మధనం స్టార్ట్..?

  • Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..

  • Off The Record: ఆ భార్య, భర్తల మధ్య పొలిటికల్ గేమ్..?.. చిత్ర విచిత్రంగా ఎస్‌.కోట రాజకీయం..

  • Donald Trump: యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. “జన్మతా పౌరసత్వం”పై అనుకూలంగా తీర్పు..

  • TG EAPCET 2025: ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు.. విద్యార్థులకు మరింత ప్రయోజనం

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions