ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో విచారణ కోసం కాసేపటి క్రితం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్లారు. అయితే.. అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు కేటీఆర్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 13 వేలకు పైగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ ఈరోజే..
నంది నగర్లోని తన ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. మరోవైపు.. కేటీఆర్ ఇంటి వద్ద మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా నేతలంతా అక్కడకు చేరుకున్నారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో.. 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది.
గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకతను పెంచి భవిష్యత్తు అవసరాలకు సరిపడే విద్యుత్తును సమకూర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’ని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ కొత్త పాలసీని ఆమోదించింది. 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం అదనంగా సమకూర్చుకోవాలనేది కొత్త పాలసీ లక్ష్యం.
తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి (మం) నరశింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు.