కేటీఆర్, బండి సంజయ్‌లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాను ఏ విధంగా గౌరవించాలో కేటీఆర్ నేర్చుకోవాలని అన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇన్వెస్ట్‌గేట్ ఏజెన్సీని అవమానిస్తున్నాడని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (మం) బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న సాయంత్రం హరిత రిసార్ట్‌కు వచ్చిన ప్రేమజంట.. ఓ రూమ్ అద్దెకు తీసుకున్నారు. అయితే.. రాత్రి పూట ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదు కానీ, ఉదయం రూమ్ క్లినింగ్‌కి సిబ్బంది వెళ్ళగా ప్రేమికులు ఉరివేసుకుని కనిపించారు.
గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది.
కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది.
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా విధిస్తామని ఆర్బీఐ కొత్త ఆదేశాలు జారీ…