Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..
- విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన పురందేశ్వరి
- విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుంది
- ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయని..,
- కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతా..- పురందేశ్వరి
- డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు త్వరలో కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామి రివైవల్ ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.. రూ.17 వేల కోట్లు రివైవల్ ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరంకు రూ.12500, టాక్స్ డివల్యూషన్ కింద 7200, పంచాయతీ రాజ్ శాఖకు 4800 MNREGS పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కేంద్రం సహకరించిందని పురందేశ్వరి తెలిపారు. రూ.6000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మరోవైపు.. మోడీ సభలకు జన సమీకరణ అవసరం లేదని చెప్పారు.
మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దాడిపై పురందేశ్వరి స్పందించారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవరించిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలపై దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
Read Also: Alleti Maheshwar Reddy : బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (బుధవారం) విశాఖకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్ పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు.
Read Also: Oneplus12 Offer: త్వరపడండి.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గంపు
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!