విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్‌ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు. స్టాల్స్ పెట్టిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్‌లో భాగంగా ఇలాంటి టెక్ ఫెస్ట్ లను మరింతగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ నిర్వాహకులతో చెప్పారు. ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ 2025.
Read Also: Jr- NTR – Balakrishna: అన్‌స్టాపబుల్ జూ.ఎన్టీఆర్ వివాదం.. అసలు విషయం చెప్పేసిన బాబీ
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ఈ టెక్ ఫెస్ట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ టెక్ ఫెస్ట్ ఇక్కడితో ఆగకూడదు.. జీవితంలో ఏదైనా సాధించడానికి ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలని తెలిపారు. క్రికెట్, కారు, బిర్యానీ తనకు నచ్చేవని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాలు ఇవాళ ఈ ఫెస్ట్‌లో చూశానన్నారు. గ్రామాల్లో కూడా అద్భుతమైన సాంకేతికత ఉందని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా అని ప్రధాని చెప్పిన మాట చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకొక్క జిల్లాకి ఒకొక్క ప్రాధాన్యత ఇచ్చాం.. రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైలట్ ప్రాజెక్టులు చేసేలా విద్యార్ధుల కోసం జీఓ తెస్తామని తెలిపారు. జీఏడీలో కచ్చితంగా టెక్నాలజీ వినియోగించేలా తాను మాట్లాడతానన్నారు. డేర్ టూ డ్రీమ్, స్ట్రైవ్ టూ అచ్చీవ్ అని చంద్రబాబు చెప్పేవారని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV సేఫ్టీ, టెక్ ఫీచర్లు అదుర్స్..