చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ వెబ్సైట్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలో జరిగిన గ్రానైట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తామని అన్నారు. కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర.. దేశంలో ఏ పార్టీకి ఇలాంటి ఘనత లేదని పేర్కొ్న్నారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Kottu Satyanarayana: వైసీపీపై పురంధేశ్వరి చేసిన ఆరోపణలు అర్ధ రహితం..
కుప్పంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేశాం.. కుప్పం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జననాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం.. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా, యాప్ ద్వారా చెప్పుకోవచ్చని సీఎం అన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రజలు, కార్యకర్తల సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తామని చెప్పారు. భూ సమస్యలు ఐదేళ్ళుగా తీవ్రంగా పెరిగాయి.. కుప్పంలో జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. జననాయకుడులో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్‌లైన్ ఎంట్రీ చేస్తామని సీఎం తెలిపారు. మరోవైపు.. ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చామని.. కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో చాలా కీలకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Chandrababu and Pawan Kalyan Vizag Tour: రేపు మధ్యాహ్నం విశాఖకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..