థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివకుమారి, నవీన్ అనే ఇద్దరు కీలక వ్యక్తులు టీపీఎఫ్‌లో ఉండేవారని.. వారు చెప్పే మాయ మాటలు విని తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఒరిస్సా నుండి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామని బాధితులు చెబుతున్నారు.
Read Also: Formula E-Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
సీఎస్ఆర్ ఫండ్స్, సామాజిక సర్వీస్ పేరుతో అమాయకులను ముగ్గులోకి దింపుతున్నారు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు.. ఎక్కడ ఉందో తెలియని సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టి కొందరు అమాయకులు మోసపోయారు. ఇప్పుడు టీపీఎఫ్ సంస్థ ప్రతినిధులు కనిపించకపోవడం విదేశాలకు పారిపోయారన్న అనుమానంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన శివ కుమారి అనే మహిళను పిలిపించి పోలీసులు విచారించారు.
Read Also: BSNL Recharge: ఆలోచించిన ఆశాభంగం.. ఊహించని ధరకి 14 నెలల వ్యాలిడిటీ
టీపీఎఫ్, సీఎస్ఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ.. కోట్లల్లో వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో శివకుమారి కీలకపాత్ర పోషించారని.. నవీన్‌బాబు, షేక్ గౌస్‌తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయాలని.. లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీరు మున్నీరయ్యారు.