విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.. 11 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు రిక్షావాడు. రిక్షాలో తన ఇంటికి తీసుకువెళ్లి బలాత్కారం చేయబోయాడు రిక్షావాడు (70) కోపెలా బాల స్వామి. బాలిక తల్లిదండ్రులు విజయవాడ పంజా సెంటర్‌లో పాత బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఆ కుటుంబం విజయవాడ వాగు సెంటర్‌లో నివాసం ఉంటున్నారు. బాలిక.. విజయవాడ బంగారయ్య కొట్టు సందులో YSM స్కూల్ లో 4వ తరగతి చదువుతుంది. బాలిక తల్లి తమ బంధువులలో ఆరోగ్యం బాలేదు అని ఆస్పత్రికి వెళ్లింది. తనతో పాటు బాలికను కూడా తీసుకువెళ్ళింది. హాస్పిటల్ నుంచి ఒంటరిగా వెళ్తున్న బాలికను చూసిన రిక్షావాడు.. తన ఇంటి దగ్గర దింపుతానని బలవంతంగా 6వ తేదీ సాయంత్రం రిక్షా ఎక్కించుకున్నాడు. రిక్షాలోనే తాకరాని ప్రదేశాల్లో తాకాడు. దీంతో.. బాలిక ఒక్కసారి అరవడంతో బాలిక నోరు మూసి ఫైజర్ పేటలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు రిక్షావాడు.
Read Also: KTR : హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేటీఆర్
రిక్షాలో వెళ్లడం చూసిన బాలిక మామయ్య నాగరాజు.. రిక్షాలో ఇంటికి వెళ్తుందేమోనని అనుకున్నాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అన్నయ్య నాగరాజుకు విషయం చెప్పిన బాలిక తల్లి.. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో రిక్షావాడి ఇంటి అడ్రస్ తెలుసుకొని బాలికను కాపాడాడు. బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన రిక్షావాడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిక్షా వాడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read Also: Nara Lokesh: జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..