చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. రూ.110.21 కోట్లతో కుప్పం నియోజక వర్గంలోని 451 డ్రైనేజీ వర్కులను జీఎస్‌హెచ్ 11- ఎస్‌డిపి నిధుల ద్వారా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు.
Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. స్వర్ణ కుప్పంలో కీలకమైనదిగా ఉద్యోగ కల్పన పెట్టుకున్నాం.. అందుకు నూతన ఎంవోయూ చేసుకున్నామని తెలిపారు. కుప్పంలో చిన్నపిల్లల సంఖ్య తగ్గింది.. కుప్పంలో జనాభా తగ్గుతుందని సీఎం అన్నారు. మరోవైపు.. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు చాలా కంపెనీల ముందుకు వచ్చాయి.. రూ.105.10 కోట్లతో 4800 మందికి ఉపాధి దిశగా మదర్ డెయిరీ ఫ్రూట్ విజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తంబిగాని పల్లి వద్ద ఎకరాల 41.22 విస్తీర్ణంలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఫ్రూట్ పల్ప్ తయారీ.. 50 వేల మంది రైతులకు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.233 కోట్లతో 4000 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం IP తంబిగాని పల్లి, తంబిగాని పల్లి వద్ద 40 ఎకరాలలో ఏపిఐఐసి ద్వారా ముఖ్యమంత్రి భూమి కేటాయించారు.
Atishi: సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి
కుప్పాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీ తయారు చేయడానికి రూ.92 కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే.. బిగ్ బాస్కెట్ ద్వారా కుప్పం నుండి కూరగాయల అమ్మకం సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్ళకు సోలార్ కరెంట్ అందిస్తామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో తొలిసారిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ సహా సిబ్బందిని అనుసంధానం చేసేలా టాటా కంపెనీతో ఓ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామన్నాం.. దాని ద్వారా మెరుగైన వైద్యం ప్రజలు అందిస్తామన్నారు. కుప్పాన్ని టూరిజం హబ్‌గా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం.. కుప్పంలో త్వరలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. ఎయిర్ కార్గో సహా విమానాల రిపేర్ చేయడానికి వీలుగా ఎయిర్ పోర్టు నిర్మాణం.. దానివల్ల వేలాదిమందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అంతేకాకుండా.. కుప్పం నుండి బెంగుళూరుకు గంటలో వెళ్ళేలా రోడ్డు వేస్తామని చెప్పారు. మూడు నెలల తరువాత మళ్ళీ వస్తాను.. అభివృద్ధి పనులను పరిశీలన చేస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.