పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళన జరగాలన్నారు మంత్రి.. ఈ క్రమంలో.. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేపట్టాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీల్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా క్రెడిట్ ఫ్రేమ్ వర్క్, ఇంటర్న్ షిప్‌లు ఉండాలని చెప్పారు. యూనివర్సిటీల వీసీల నియామకంలో అకడమిక్ ఎచీవ్‌మెంట్స్, కరిక్యులమ్ డెవలప్‌మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ స్ట్రాటజీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటయ్యే అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యుల ఎంపికలో విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టేక్ హోల్డర్లు, పాలసీ ఎక్స్ పర్ట్స్, రీసెర్చ్ నిపుణులకు స్థానం కల్పించాలని మంత్రి లోకేష్ తెలిపారు.
Dan Christian: అరుదైన ఘటన.. క్రికెటర్లకు గాయం కావడంతో రంగంలోకి కోచ్
వీసీలు, అడ్వయిజరీ కౌన్సిల్ నియామకాలను మార్చినాటికి పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. కరిక్యులమ్ రీస్ట్రక్చర్ సమయంలో సమర్థ్ ప్లాట్ ఫాం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వర్సిటీల్లో హాస్టళ్ల పనితీరును మెరుగుపర్చేందుకు వెబ్ బేస్డ్ మెనూ, సజెషన్ బాక్సులను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, ఇన్నోవేషన్ యూనివర్సిటీ, ఐఐయుఎల్ఇఆర్‌ల ఏర్పాటుపై చర్చ జరిగింది. యూనివర్సిటీల్లో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియాను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని, చెలెనింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి విద్యార్థులను ఎంపికచేయాలని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో అకాడమిక్ రోడ్ మ్యాప్, రివైజ్డ్ సిలబస్ – టెక్స్ట్ బుక్స్, అకాడమీ క్యాలండర్ రూపకల్పన న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్, మార్కింగ్ ప్యాట్రన్ పై మంత్రి లోకేష్ సమీక్షించారు. ఇంటర్మీడియట్ విద్యలో గత పదేళ్లుగా ఎటువంటి సంస్కరణలు చేపట్టలేదన్నారు. మ్యాథ్య్‌లో ఒకే పేపర్, బాటనీ, జువాలజీలు కలిపి ఒకే పేపర్ ఉండేలా మార్పులు చేయడంపై చర్చ సాగింది. అదేవిధంగా సీబీఎస్ఇలో మాదిరి ఇంటర్నల్ మార్కుల విధానం అమలుపై చర్చించారు. అదేవిధంగా ప్రిఫైనల్ ఎగ్జామ్స్‌ను జనవరికల్లా పూర్తిచేసేలా క్యాలెండర్ రూపొందించాలన్నారు. సంస్కరణలు తెచ్చేటప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేసి విద్యారంగ నిపుణులు, ప్రజా ప్రతినిధులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
Mansoor Ali Khan: డ్రగ్ కేసులో నటుడి కొడుక్కి కండిషనల్ బెయిల్!
స్కూలు ఎడ్యుకేషన్‌లో ఇప్పటివరకు అమలుచేస్తున్న ఒఎంఆర్ షీట్స్ ద్వారా కాకుండా డిజిటల్ ఎసెస్‌మెంట్ విధానం అమలుకు అవకాశాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. దీనివల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగడమేగాక.. ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జీఓ నెం. 117కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్లేస్కూలు పాలసీపై కూడా సమావేశంలో చర్చసాగింది. పాఠ్యాంశాల్లో నైతికవిలువల అంశాలను ప్రవేశపెట్టడంతోపాటు సెమిస్టర్ వైజ్‌గా వేర్వేరు టెక్స్ట్ బుక్స్ కాకుండా ఒకే పుస్తకాలు రెండు సెమిస్టర్ల పాఠ్యాంశాలు ఉండేలా రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనివల్ల పాఠశాల విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించవచ్చని సూచించారు. ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా డీఎస్సీని నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో విధివిధానాలపై సమావేశంలో మంత్రి లోకేష్ చర్చించారు.