లక్నోలో కాల్పుల ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడని.. కాల్పులు జరిపిన నిందితుడు.. బతకడని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కేరళలోకి రుతుపవానాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు.
ఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (CRCS) కార్యాలయం కంప్యూటరీకరణ పురోగతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. సీఆర్‌సీఎస్ కార్యాలయం ద్వారా నిర్వహించే పోటీల ద్వారా యువత కూడా పోర్టల్‌ను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని.. అంతేకాకుండా మెరుగైన అనలిటిక్స్‌లో భాగస్వాములు కావాలని అమిత్ షా తెలిపారు.
ఐస్ క్రీం అంటే మనందరికి తెలిసి చల్లగా ఉంటుంది.. దానికి కొద్దిగా హీట్ తగిలినా కారిపోద్ది. అలాంటిది ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తుంటే.. ఆ వెరైటీ రెసిపీ అందరిని నోరూరిస్తుంది.
బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్.
న్యూయార్క్ నగరం దట్టమైన పొగతో కమ్ముకుని ఉంది. మంగళవారం అక్కడి ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోయారు. సాయంత్రం వరకు నగరం మొత్తం దట్టమైన పొగతో కప్పేసింది. న్యూయార్క్ నగరం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి కారణమేంటంటే.. కెనడాలో కార్చిచ్చు ప్రభావంగా నగరం మొత్తం ఈ పరిస్థితికి దారితీసింది.
గుంతలో పడ్డ వ్యక్తిని క్షేమంగా బయటకు తీసిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద జరిగింది. మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో ఓ వ్యక్తి పడిపోగా.. అక్కడున్న స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎస్ భరత్ ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. మాములుగా ఐతే క్రికెటర్స్ సోషల్ మీడియాను ఎక్కువగానే ఫాలో అవుతుంటారు. వారి ఫోటోస్, వీడియోస్ పెట్టడం లాంటివి చేస్తూంటారు. కానీ లండన్ లో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా.. అశ్విన్, భరత్ల ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు.