అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.
క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? వాడితే నష్టమా.. లాభమా..? క్రెడిట్ కార్డ్ గట్టిగా వాడేస్తున్నారా.. జాగ్రత్త. భవిష్యత్‌లో బ్యాంకు నుండి రుణాలు పొందే అవకాశాల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. మనలో చాలా మంది క్రెడిట్ కార్డును స్టేటస్సింబల్గా ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నా, లేకున్నా పరిమితికి మించి ఖర్చు చేస్తారు. అయితే దీని వల్ల మన క్రెడిట్స్కోర్ దెబ్బతీస్తుంది. బ్యాంకు ద్వారా మనం లోన్ పొందాలంటే వారు ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తారు.
జియో వినియోగదారులకు శుభవార్త అందించింది ఆ సంస్థ. ఇప్పటికే తెలంగాణలో కొన్ని చోట్ల జియో ట్రూ 5జీ సేవలు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 850కిపైగా ప్రధాన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది.
పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువచ్చే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో సులభంగా పండించుకునే పంటలో గోరు చిక్కుడు ఒకటి. గోరు చిక్కుడుతో అన్నీ లాభాలుంటాయా అంటే అవుననే అంటున్నారు. పంట విషయానికి వస్తే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సైతం గోరుచిక్కుడు ఏపుగా ఎదుగుతుంది. దీనికి ఎరువుల వాడకం కూడా చాలా తక్కువ. గోరుచిక్కుడు మనం కూర మాత్రమే వండుకొని తింటాం కానీ.. దానిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
యాపిల్ అతిపెద్ద ఈవెంట్ WWDC 2023 నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. యాపిల్ కంపెనీకి పలు ప్రొడక్ట్స్ రిలీజ్ కానున్నాయి. మీరు యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తున్నా, లేకపోతే యాపిల్‌కు సంబంధించి బోలెడంతా సమాచారం దీంట్లో లభిస్తాయి. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, హార్డ్ వేర్ లాంచెస్... ఇలా ఎన్నో ఈరోజు మార్కెట్లోకి రానున్నాయి.
ఓ యాప్ ద్వారా మాల్ వేర్ మన ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. అది అందరికీ తెలిసిన యాపే. దాని పేరు ఐ రికార్డర్(iRecorder – Screen Recorder). ప్రముఖ ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇది. దీని ద్వారా మాల్ వేర్ ఫోన్లలోకి చొరబడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫిర్మ్ ఈసెట్(ESET) ప్రకటించింది.
చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. మే నెలలో భారత దేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌లో దాదాపు 42 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ దేశం చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి.
రెప్లికాపై సృష్టించిన AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడింది ఓ మహిళ. అంతేకాకుండా ఈ సంవత్సరమే చాట్ బాట్ ను 'పెళ్లి చేసుకుంది. 'ఉత్తమ భర్త' అంటూ తేల్చి చెప్పింది ఆ మహిళ. AIచాట్ బాట్ ప్రజల జీవితాన్ని కూడా తీసుకుంటుందని ఎవరనుకుంటారు. 36 ఏళ్ల మహిళ రోసన్నా రామోస్ కృత్రిమ మేధస్సుతో నడిచే వర్చువల్ మనిషిని వివాహం చేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
స్మార్ట్ ఫోన్ సాయంతో రక్తపోటును చెకప్ చేసుకునేందుకు మోనిటర్ చేసే క్లిప్ ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో బృందం తయారుచేసింది. ఫోన్ లో ఉన్న ఓ యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తయారు చేసేందుకు 80 సెంట్స్ ఖర్చు అయ్యింది. అయితే దీనిని 10 సెంట్లకు తీసుకొచ్చేలా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సైటిఫిక్ రిపోర్ట్స్ లోని జర్నల్ లో పబ్లిష్ అయ్యింది. దీని సాయంతో రెగ్యూలర్ బీపీ మోనిటరింగ్ సులభతరం అవుతుంది. అలాగే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది.
డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎక్కువగా ఫ్రాంచైజీల వైపు చూస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు భారీ మొత్తంలో మోసపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు.