తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో దాదాపు 10 సినిమాలు ఓ అడవి దున్నను చుట్టుముట్టాయి. ఇంక తన పని అయిపోందనుకున్న దున్న.. గట్టిగా ధైర్యం తెచ్చుకున్నట్టుంది. సింహాలన్నీ చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా.. ఆ దున్న మాత్రం దైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆ దున్న సింహాలనుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగి వెళ్తుంది. సింహాలు నీటిలోకి రావు కదా.. అందుకే దైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాలనుంచి తప్పించుకుంది అడవి దున్న.
టీమిండియా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు ఆసీస్ ప్రణాళికలు రచించుకున్నారు. అందుకు సంబంధించి ఆసీస్.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో ఫైనల్ బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పాడు. ఇక ఈ ముగ్గురిలో తనతో పాటు, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలండ్ ఉన్నారని తెలిపాడు.
పోలీసులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ మ్యానువల్ పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల భావ వ్యక్తీకరణను అడ్డుకొని భయభ్రాంతులకు గురి చేయాడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసిన ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారని భట్టి పేర్కొన్నారు.
Ration Dealers: సమ్మె కొనసాగింపుపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది. Read Also: R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య డీలర్లు చనిపోతే […]
ఈ రోజుల్లో అశ్వగంధాన్ని అందరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు తరుచుగా వాడుతుంటారు. ముఖానికి గానీ, శరీరానికి గానీ దీన్ని వాడుతుంటారు. అశ్వగంధం అనేది ఎన్నో ఏండ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధ శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి.
మీరు ప్లాస్టిక్ వాడుతున్నారా.. చాలా డేంజర్ గురూ.. ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఫుడ్, ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్, ప్లాస్టిక్ కవర్స్ లో ఇతరత్రా వస్తువులు తీసుకుని వెళ్తున్నారా.. ప్రమాదం బారిన పడినట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని నిపుణులు చెబుతున్నప్పటికీ జనాలు పెడచెవిన పెడుతున్నారు. అసలు ప్లాస్టిక్ వాడితే ఆరోగ్యానికి హానికరమని కొంతమందికి ఇంకా తెలియదు.
ఒడిశా సహాయ నిధికి విరాట్ కోహ్లీ రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చాడని ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కానీ అందులో నిజం లేదని కోహ్లీ ట్వీ్ట్ చేశాడు. రైల్వే ప్రమాదం గురించి తెలుసుకున్న కోహ్లీ మరణించినవారి పట్ల దిగ్బ్రాంతి చెందానని, గాయాలపాలైన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. అంతేకానీ విరాళం చేశానని ఎక్కడా ప్రకటించలేదన్నాడు కోహ్లీ.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేపు(బుధవారం) ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో ఛాంపియన్ షిప్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టెస్ట్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. ఈసారైనా కప్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవనగరం సమీపంలో మావోయిస్టు పార్టీకి కొరియర్లగా పనిచేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 141 బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలలో వారు పట్టుబడ్డారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్. జి తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఈసీ వర్సెస్ వీసీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ దాడులు నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై ఆరోపణలు వస్తున్న.. నేపథ్యంలో రైడ్స్ చేశారు అధికారులు. అటు అకౌంట్ సెక్షన్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏవో కార్యాలయంలో సోదాలు చేసి.. పలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు.