Speaker Pocharam: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత సీఎం ఎవరన్నదానిపై ప్రచారం సాగుతుంది. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లో కూడా ఓ ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. తన మనసులోని మాటను వెల్లగక్కారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలిపారు.
Read Also: Rajasthan: పెళ్లి కావాల్సిన యువతి కిడ్నాప్.. అలా చేసి పెళ్లైపోయిందన్న నిందితుడు..
నిజామాబాద్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తర్వాత కేటీఆరే తెలంగాణకు సీఎం అని అన్నారు. ఎందుకంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో కేసీఆర్ ఢిల్లీ పాలిటిక్స్ లోకి వేళ్తే కేటీఆరే సీఎం అవుతారని పోచారం అభిప్రాయపడ్డారు. మరోవైపు సీఎం కేసీఆర్ పలుసార్లు మీడియా సమావేశంగా గానీ, సభల ద్వారా మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. అందుకనుగుణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఫోకస్ మహారాష్ట్రపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు భారీ సభలు నిర్వహించారు. అక్కడి నుండి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి.
Read Also: Minister KTR: తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ నిరూపించారు
అయితే గతంలో కూడ కేటీఆర్ ను సీఎం చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం సాగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని దాదాపుగా ఐదారేళ్లుగా అనుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ సీఎం విషయమై గతంలో రెండు మూడుసార్లు స్పష్టత ఇచ్చారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా మారితే కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోలేదు.