Health Tips: బీట్ రూట్ తో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరిగా తినడం కానీ.. తాగడానికి కూడా సమయం లేకుండా పోతుంది. దీంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా మారి కనీసం 70, 80 సంవత్సరాలు బ్రతకాల్సిన మనుషులు 40, 50 ఏళ్లకు తనువు చాలిస్తున్నారు. దానికి కారణం ముఖ్యంగా ఆహారపు అలవాట్లే.
Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..
ఎక్కువగా మధుమేహం, క్యాన్సర్, బిపి, థైరాయిడ్ లాంటి సమస్యలు మనుషుల్లో అధికమవుతున్నాయి. అంతే కాకుండా ఎక్కువగా ప్రజలు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పదార్థం తీసుకోవడం ద్వారా బయటపడొచ్చు అదేనండి బీట్ రూట్.
Read Also: Lifestyle : పెళ్లయిన మగవాళ్ళు వేరే స్త్రీలను ఎందుకు ఇష్ట పడతారో తెలుసా?
రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు.. రోజు వారు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా బీట్ రూట్ ని ఉపయోగించాలి. దీని ద్వారా ఆ సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చు. అంతేకాకుండా బీట్ రూట్ లో అధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. మనిషి శరీరంలో సరైన హిమోగ్లోబిన్ శాతం లేకపోతే శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. తద్వారా రక్తహీనత సమస్యలకు గురవుతారు. అయితే ఈ బీట్ రూట్ తినటం వల్ల కేవలం రక్తహీనత సమస్యకు మాత్రమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలనుంచి బయటపడవచ్చు..
Read Also: Adipurush: ట్రైలర్ ట్రెమండస్… ఆల్బమ్ అద్భుతం… అంచనాలు పీక్స్
రోజుకి ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం ద్వారా రక్తహీనత సమస్యకు ముగింపు పలకవచ్చు. అదే విధంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బీట్ రూట్ ను కూరగా చేసుకుని తినొచ్చు, ఫ్రూట్ సలాడ్ గా తినవచ్చు మరియు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బీట్ రూట్ తినడం వల్ల కాలేయ సమస్యలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే కూడా ప్రతిరోజు బీట్ రూట్ తీసుకోవడం ద్వారా కాంతిమంతంగా మారుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే బీట్ రూట్ జ్యూస్ ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.