కోతి వేషాలంటే మాములుగా ఎట్లుంటాయో మనకు బాగా తెలుసు. కోతి చేసే విన్యాసాలు, అల్లర్లు చూడటానికి చూపరులకు అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కోతి అల్లర్లను బట్టి మనుషులను కూడా కొందరు అంటుంటారు.. కోతిలా చాష్టలు చేస్తున్నావని. అందుకే కోతి అంటే అంతా ఫేమస్. అయితే ఇప్పుడు ఒక కోతి వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్‌లో డాక్టర్‌నంటూ ఆ వృద్ధురాలితో మాట మాట కలిపాడు. అంతే ఇంకేముంది ఆమే అనారోగ్యం సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నీకున్న జబ్బును నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు.
ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు.
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
తిరిగి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి తిరిగి సేవలను ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుండి చెన్నైకి మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. అధికారులు సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది.