Ice Cream: ఐస్ క్రీమ్ లల్లో చాలా రకాలను చూశాం.. విన్నాం.. తిన్నాం. కానీ ఇప్పుడొక వెరైటీ ఐసీ క్రీం అందరినీ షేక్ చేసేస్తుంది. ఐస్ క్రీంను ఇష్టపడని వారుండరు. అలాంటిది స్పెషల్ ఐస్ క్రీం అనగానే లొట్టలేసుకుని తింటారు. ఇంతకీ ఏంటా ఐస్ క్రీం. దాని వివరాలేంటో ఓసారి చూద్దాం.
Read Also: MSP Increase: రైతులకు కేంద్రం శుభవార్త.. కనీస మద్దతు ధర పెంపుకు క్యాబినెట్ ఓకే..
ఐస్ క్రీం అంటే మనందరికి తెలిసి చల్లగా ఉంటుంది.. దానికి కొద్దిగా హీట్ తగిలినా కారిపోద్ది. అలాంటిది ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తుంటే.. ఆ వెరైటీ రెసిపీ అందరిని నోరూరిస్తుంది. మనం తరుచుగా వెరైటీ వెరైటీ కాంబినేషన్ల ఫుడ్ లను గూగుల్ లో చూస్తుంటాం. థంబ్స్ అప్ పానీపూరీ, రస్గుల్లా చాయ్, ఇడ్లీ కుల్ఫీ వంటి విచిత్రమైన కాంబినేషన్లు గతంలో కొందరు ప్రయత్నించి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సమ్మర్ లో చాలా మంది ఇష్టపడే ఐస్ క్రీం తో ఓ వెరైటీ యమ హల్ చల్ చేస్తోంది. ఫుడ్ వ్లాగర్ సలోని బోత్రా ఈ అసాధారణమైన ట్రీట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Read Also: WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న భారత్
వైరల్ అవుతున్న ఈ వీడియోలో గడ్డగా ఉన్న తియ్యని వెనీలా ఐస్ క్రీం ను తీసి ఓ గిన్నెలో వేసి, దాన్ని ఓ బాల్ లా చేశాడు. దానిని బ్రెడ్ ముక్కల పొడిలో కలిపి, ఆ తర్వాత ఆ బాల్ ను నూనెలో వేయించారు. అది గోధుమ రంగు వచ్చే వరకు ఉంచాడు.. అనంతరం దాన్ని సర్వింగ్ బౌల్ లో వేస్తారు. ఆ తర్వాత దానిపై చాకోలెట్ క్రీమ్ ని పోస్తారు. అలా ఏర్పడ్డ మిశ్రమాన్ని స్పూన్ తీయడం అందర్నీ ఆకర్షిస్తోంది. అయితే ఈ వెరైటీ రెసిపీకి పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. “నేను దీన్ని ప్రయత్నించాను . ఇది చాలా రుచికరమైనది. అది చాలా బాగుంది” అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. కాగా ఇప్పుడు ఈ వైరల్ వీడియోకు 67వేల లైకులు, వెయ్యి కామెంట్స్, 86వేల షేర్స్ వచ్చాయి.
https://www.instagram.com/reel/Cr3ctPgoDKj/?utm_source=ig_embed&ig_rid=65c0f5f1-03df-45f7-a806-687aed69c03d