విజయవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సందడి చేసారు. కృష్ణానది ఒడ్డున బెజవాడ ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రం అంతా మూడు సార్లు తిరిగానని ఈ సందర్భంగా తెలిపారు. చిరంజీవి, పవన్ లు జనసేన పార్టీని అల్లు అరవింద్ మధ్యవర్తిగా అమ్మకానికి పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Micromax Electric Vehicle: స్మార్ట్ ఫోన్లే కాదు.. ఇకపై మైక్రోమ్యాక్స్ ఎలక్ట్రిక్ బైక్‌లు!
ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు. బీజేపీలో జనసేన విలీనం చేస్తే వేల కోట్లు వస్తాయని అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ తో నిర్ణయించారని కేఏ పాల్ అన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. మోదీ యాత్ర అని విమర్శించారు.
Bigg Boss Telugu 7: ఎవరి ఊహకు అందని సీజన్.. నాగ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే
మరోవైపు ఇటీవలే చనిపోయిన గద్దర్.. ప్రజాశాంతి పార్టీలో చేరారని కేఏ పాల్ తెలిపారు. బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు.. నా ఫాలోయింగ్ ని మీరు ఆపగలరా అని అన్నారు. చంద్రబాబుకు రెండో ఛాన్స్ లోకేష్ ని సీఎం చేయడానికి కావాలా అని పాల్ ప్రశ్నించారు. ఏపీ క్యాపిటల్ ఎక్కడ అని ఎనిమిదేళ్ళ బాబు అడిగాడని.. దానికి తానేమీ చెప్పలేకపోయానని తెలిపారు. రాష్ట్రానికి చంద్రబాబు ఏమీ చేయలేకపోయాడని.. ఉద్యోగాలు ఏం ఇచ్చాడని ప్రశ్నించారు. అప్పుల రాష్ట్రాన్ని అనుభవం లేని జగన్ కి ఇచ్చారని.. 20, 30 సంవత్సరాల అప్పు ఒక్కసారే చేసారని ఆరోపించారు. మరోవైపు వచ్చేనెల ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో తెరుస్తున్నామని కేఏ పాల్ తెలిపారు.