విశాఖలోని జగదాంబ సెంటర్ లో మూడో వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు జనసైనికులు భారీగా తరలివచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పోరాడటానికి విశాఖ దైర్యం ఇచ్చిందని అన్నారు. ఏమి మాట్లాడతాడో చూద్దాం అనుకుంటున్న వైసీపీ నాయకులకి నమస్కారాలు అంటూ మొదలుపెట్టారు. ప్రొద్దునే పథకం కింద డబ్బులు ఇస్తారు.. సాయంత్రం సారా కింద డబ్బులు లాగేసుకుంటుందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు గుండాలు, రియల్ ఎస్టేట్ రాబందుల చేతులలో విశాఖ ఇరుక్కుపోయిందని ఆరోపించారు. వారి తోలు తీయడానికి పవన్ కళ్యాణ్ మీ కోసం ఉన్నారని తెలిపారు. గుండాల కాలుకి కాలు, కీలుకి కీలు తీసే ప్రభుత్వం వస్తుందని అన్నారు.
Cab Driver Attack: మహిళను, ఆమె కొడుకును చితకబాదిన క్యాబ్ డ్రైవర్.. ఏం జరిగిందంటే?
అంతేకాకుండా.. ప్రాణాలు తెగించే పోరాటానికి సిద్ధం అయ్యానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేసే వరకు జనసేన పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారని.. తెలంగాణ రావడానికి జగన్ కారణమని పవన్ పేర్కొన్నారు. మరోవైపు ఋషి కొండను ఎలా తవ్వేశారని పవన్ ప్రశ్నించారు. ఎర్ర మట్టి దిబ్బలు చెక్కేశారని.. దానిని పది మంది దోచేస్తున్నారని తెలిపారు. విశాఖ వాసులు పెట్టిన పరీక్షకు నిలపడ్డానని.. ఓడిపోయిన తనను విశాఖ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పవన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ముప్పై వేలు మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటే వైసీపీ గుండాలు మాట్లాడారన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అదే చెప్పారని.. ఏపీలో చైల్డ్ హ్యూమన్ ట్రాకింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో విశాఖ ముందు ఉందని పేర్కొన్నారు.