ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు నియామకం జరిగింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిఫల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చే నామినేట్ చేయబడిన కర్రి పద్మ, డా.కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్.సంఖ్య.87 ను నేడు జారీ చేశారు.
Pakistan National Assembly: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం గత నెల 20 వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో వీరిద్దరినీ శాసనమండలి ఛైర్మన్ తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపడతారు.