మూడవ విడత వారాహి యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కాసేపట్లో వారాహి విజయయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వారాహి యాత్ర కోసం జనసైనికులు భారీగా తరలివచ్చారు. దీంతో జగదాంబ జంక్షన్ జనసంద్రంగా మారడంతో.. ఆ ప్రాంతమంతా జనసైనికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు సభా ప్రాంగణానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Karnataka: వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ
మరోవైపు వారాహి యాత్ర బహిరంగ సభకు వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగింది. పోలీసులు బారికేడ్లు దాటుకుని వెళ్లే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు రోడ్డుపై పడిపోయారు. వారాహి సభకు వెళ్లే కార్యకర్తలు, అభిమానులను జడ్జి కోర్టు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో సభకు వెళ్ళేందుకు వచ్చిన వందల మంది జనసైనికులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో పోలీసులు లాఠీలు జులిపించారు. సభకు వచ్చిన జనసైనికులు.. సభకు వెళ్ళనివ్వాలిసిందేనని పట్టుబడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. పోలీసులు సభ ప్రాంగణం వద్ద నిలబడేందుకు చోటు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.