పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్ విజయాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2027, 2032లో జరిగే యూపీ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అంబటి రాయుడు.. మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ లో బలమైన సారథిని నియమించాలని బంగ్లా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని ఎంపిక చేశారు.