విశాఖలోని జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పనులు చేయిస్తున్నాడని విమర్శించారు. సింహద్రి సాక్షిగా చెప్తున్నాను.. వాలంటర్లు మీద ద్వేషము లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని తెలిపారు. అన్న, అక్క అని జగన్ అధికారులతో పనులు చేయించుకుంటున్నాడన్నారు. అలా పిలిచి అధికారులను సిబీఐ కేసులలో జైలులో పెట్టించాడని పవన్ పేర్కొన్నారు.
Posani Krishna Murali: టికెట్ రేట్స్.. చిరంజీవి ముందే చెప్పా.. కాదని చెప్తే చెప్పుతో కొట్టుకుంటా
గత పర్యటనలో మీరు లేకపోతే వైజాగ్ లో తనను ఏమి అయినా చేసే వారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నేల కోసం ప్రాణాలు తెగించే వారు కావాలని.. తాను ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీ గంజాయికి అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీని రౌడీ షీటర్ బందీస్తే వాళ్ళకి దిక్కు లేదని తెలిపారు. కేంద్రంతో ఒక రోజు జగన్ ను ఆట ఆడిస్తానని పవన్ అన్నారు. సమీప భవిషత్తులో అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు.
Air India New Logo: ఎయిరిండియా కొత్త లోగో.. ఎరుపు, తెలుపు మరియు ఊదా రంగులతో
మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయముగా మార్చారని పవన్ ఆరోపించారు. ఏయూలో వైసీపీ నాయకుల పుట్టిన రోజులు చేస్తారని.. గంజాయి అమ్ముతున్నారని తెలిపారు. అంతేకాకుండా.. ఇక్కడ ఉండే మంత్రి డీఎస్సీ పూర్తి చేస్తాము అంటాడు.. ఖాళీలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకి జీతాలు ఇవ్వరని.. బైజుస్ కి 500 కోట్లు ఇచ్చారని పవన్ పేర్కొన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు 25 వేలు కోట్లకి తాకట్టు పెట్టాడని తెలిపారు. డబ్బు అంటే జగన్ కి పిచ్చి అయిపోయిందని.. ఇన్ని వేల కోట్లు ఏమి చేసుకుంటావని ప్రశ్నించారు. జగన్ కి మరొక అవకాశం ఇస్తారా అని ఆలోచించుకోండని విశాఖ ప్రజలను అడిగారు. మద్యం మీద ముప్పై వేలు కోట్ల ఆదాయం జగన్ సంపాదించాడని.. జగన్ ఒక దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అన్ని కీలక పదవులు ఒక కులంతో నింపాడని పవన్ కళ్యాణ్ తెలిపారు.