నామ్నేర్ కూడలి వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి దగ్గరికి వచ్చిన ముగ్గురు యువకులు.. మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు వద్దని ఎంతా మొరాయిస్తున్న ఆ కామంధుడు వినలేదు. అయితే.. సమీపంలోని ఓ దుకాణంలో నిద్రిస్తున్న యువకుడు కేకలు విని లేచాడు. ఈ ఘటనకు పాల్పడుతున్న నిందితుల వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నామ్‌నేర్ కూడలిలోని కంట్రీ లిక్కర్ ఎదురుగా గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఘజియాబాద్లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది.
ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలు రోజు రోజుకు అవుతున్నాయి. ఇప్పటికే చాందినీ చౌక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే.. దేశ రాజధానిలో మరో ప్రమాదం సంభవించింది. దీంతో.. ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఎండలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా.. సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కువైట్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారిలో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వారి మృతదేహాలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. మృతదేహాలకు రాష్ట్ర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికింది. రాష్ట్రంలోని వలస సమాజాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద సంఘటనలలో ఇది ఒకటి. మరోవైపు.. బాధితుల ఇళ్లలో చోటు చేసుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి.
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఔట్‌రీచ్ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శుక్రవారం నాడు ప్రపంచంలోని ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సాయంత్రం వరకు ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. మూడోసారి ప్రధాని అయినందుకు మోడీని కలిసిన ప్రతి దేశాధినేత అభినందనలు తెలిపారు. ఇటలీలోని అపులియా నగరంలో జరిగిన ఈ సమావేశం ప్రపంచ శక్తులతో […]
రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు.
ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన ఘటన కాన్పూర్ లో జరిగింది. మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. ప్రభుత్వ అధికారిపై కోపంతో ఫైలు విసిరింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్ ప్రమీలా పాండే డ్రైనేజీ వ్యవస్థల పరిశుభ్రత, ఇతర సంబంధిత విషయాల గురించి కాన్పూర్ నగర్ నిగమ్ సమావేశానికి హాజరయ్యారు. డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్‌ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది.