Amit Shah Review: జమ్మూ ఉగ్రదాడి ఘటన.. ఎల్లుండి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
- జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష
- రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చ
- జూన్ 16న మరోసారి ఉన్నత స్థాయి సమావేశం
- జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి.. అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంహెచ్‌ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రియాసిలో యాత్రికుల బస్సుపై దాడితో సహా పలు ఉగ్రవాద దాడులపై చర్చించారు. ఈ క్రమంలో.. అమిత్ షా జూన్ 16న షా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితి, అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్నారు.
Telangana: తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులు.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఉగ్రవాద ఘటనల అనంతరం తీసుకున్న చర్యలపై హోంమంత్రికి సమాచారం అందించినట్లు సమాచారం. గత నాలుగు రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోని రియాసి, కథువా, దోడా జిల్లాల్లో నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది యాత్రికులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా, ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు పలువురు గాయపడ్డారు. కతువా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులు కూడా మరణించారు. అలాగే వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
T20 World Cup 2024: సూపర్ 8లో టీంఇండియాతో తలపడే జట్లు అవేనా..
ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో ప్రస్తుత భద్రతా రంగం, కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలపై ప్రధాన మంత్రి వివరణాత్మక సమాచారాన్ని తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం భద్రతా బలగాల వ్యూహాత్మక మోహరింపు, ఉగ్రవాద నిరోధక చర్యల కార్యాచరణ అంశాలపై దృష్టి సారించారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!