కులాంతర వివాహం జరిపించిన సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPIM) కార్యాలయంలో చోటు చేసుకుంది. జూన్ 13వ తేదీన వివాహం చేసుకున్న వివిధ కులాలకు చెందిన యువ జంటకు మార్క్సిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించాకె. ఈ క్రమంలో.. పార్టీ కార్యాలయంతో పాటు, ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్టు…
పబ్జీ గేమ్లో పరిచయం.. దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ ఇదే పబ్జీలో ఇండియాకు చెందిన సచిన్తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో.. తన భర్తను వదిలేసి పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది.
లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్‌డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకున్న లోక్‌సభలో విజయం సాధించిన తర్వాత మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు ఊరట లభించేలా కనిపించడం లేదు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే..
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్‌ను 'ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన "రాజకీయ గురువులు" అని అన్నారు. పున్‌కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం "మురళీ మందిరం"ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు.
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి నిరసన చేపట్టారు.
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్మెన్ రాజ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ పక్కనే ఉన్న కార్ సర్వీస్ సెంటర్లోకి…