ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 దుకాణాలు ఉన్న రెండు భవనాలు మంటల్లో కాలిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం బూడిదే కనిపిస్తుంది. 12 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ అగ్నిప్రమాదంలో ధ్వంసమైన దుకాణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని.. వ్యాపారుల నష్టం కోట్లలో ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
భారత సైన్యం దగ్గర ఇప్పుడు బలమైన ఆయుధం ఉంది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ మొదటి స్వదేశీ లాటరింగ్ మందుగుండు 'నాగాస్త్ర-1'ని భారత సైన్యానికి అందజేసింది. ఇది ఇంట్లోకి ప్రవేశించి శత్రువులపై దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ శత్రు భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం కలిగిస్తుంది.
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు. Viral Video: వె య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో […]
ఇటలీలోని అపులియాలో జీ-7 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాదిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం. జీ7 సమ్మిట్ ఔట్రీచ్ సెషన్‌లో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈరోజు ముందుగానే ఇటలీలోని అపులియా చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులను కలవనున్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ పర్యటన.
మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్‌లో రాయల్ అర్బన్ టైగర్‌ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పూణె పోర్స్చే ఘటన తరహాలో మహారాష్ట్రలో మరో ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి బారికేడ్‌ను ఢీకొట్టింది. దీంతో.. కారు టైర్ ఊడిపోయి పక్కనే వస్తున్న ఆటోకు తగలింది. ఈ క్రమంలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే.. మద్యం మత్తులో 21 ఏళ్ల యువకుడు కారును నడుపినట్లుగా తేలింది. ఈ ప్రమాదం.. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని జగ్తాప్ డెయిరీ సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. విద్యా సమగ్రతను కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ఒక దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఒక మేల్ కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మహిళగా నేరస్థుడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేరస్థుడు చిక్కినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం.. బూట్‌లెగ్గింగ్ వంటి 20 కేసులు నిందితుడు బంటి (45)పై ఉన్నాయి. అయితే అతన్ని ఆకర్షించడానికి ఓ కానిస్టేబుల్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్…
కువైట్ లోని దక్షిణ నగరమైన మంగాఫ్ లోని 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న 7 అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది భారతీయులు మరణించారు. కాగా.. 45 మంది భారతీయుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత.. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. భారతీయుల…