రైలు డ్రైవర్లు వేగ పరిమితిని ఎందుకు మించిపోతున్నారు..? అనే విషయాలను తెలుసుకోవడానికి రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. రైలు డ్రైవర్లు తరచుగా మొదటి, చివరి స్టేషన్ మధ్య వేగ పరిమితిని ఉల్లంఘిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా చేయడం వల్ల ప్రయాణికుల భద్రతకు ప్రమాదకరం. ఇటీవలి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బోర్డు ఈ చర్య తీసుకుందని రైల్వే సంబంధిత వర్గాలు తెలిపాయి. 2 రైలు డ్రైవర్లు నది వంతెనపై 20 kmph వేగ పరిమితిని ఉల్లంఘించారు. వంతెన నిర్వహణలో ఉండగా వారు గంటకు 120…
భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31) పరుగులతో రాణించడంతో టీమిండియా…
వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని "భారతమాత" అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి 'తల్లి' అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా... కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి కె. కరుణాకరన్.. భారతదేశంలో కాంగ్రెస్ కు తల్లి ఇందిరాగాంధీ అని…
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. జూన్ 16 నుండి 18 వరకు ఉత్తరప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో హీట్ వేవ్ నుండి తీవ్రమైన హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజుకో చోట అగ్ని ప్రమాదం జరుగుతుంది. తాజాగా.. ముండ్కా ప్రాంతంలోని ఎల్ఈడీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. 40 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై.. చీఫ్ ఫైర్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, 'ఉదయం 7 గంటల ప్రాంతంలో చెత్తకు నిప్పంటుకున్నట్లు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. అప్పటికే.. ఫ్యాక్టరీలో మంటలు భారీగా చెలరేగాయని పేర్కొన్నారు.
ఢిల్లీలో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. నీటి కోసం దాడులు చేసుకున్న సంఘటనలు వెలువడుతున్నాయి. ద్వారకా జిల్లాలో నీటి కోసం పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయితే.. ఈ ఘర్షణలో ఎలాంటి మతపరమైన కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్ కుళాయి నుంచి నీటిని తీసుకునే విషయంలో ఘర్షణ జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మధ్యప్రదేశ్లో మద్యం ఫ్యాక్టరీ నుంచి రక్షించిన 39 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. శనివారం నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆధ్వర్యంలో రైసెన్‌లోని ఓ లిక్కర్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. అందులో బాల కార్మికులు ఉన్నట్లు గుర్తించి దాడి చేయగా.. 39 మంది బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తర్వాత ఉన్నట్టుండి పిల్లలు మిస్సింగ్ అయినట్లు ఎన్‌సీపీసీఆర్(NCPCR) చైర్మన్ తెలిపారు. అంతకుముందు.. బాలకార్మికులను రక్షించిన తర్వాత ఎన్‌సీపీసీఆర్ బృందం చిన్నారుల చేతులపై కాలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రసాయనాలు…
గంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు హరిద్వార్‌కు చేరుకున్నారు. దీంతో మంగళూరులోని నర్సన్ సరిహద్దు నుంచి హరిద్వార్ వెళ్లే హైవేపై భారీ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ వ్యవస్థను సులభతరం చేసేందుకు రూర్కీలోని నాగ్లా ఇమర్తి నుంచి వాహనాలను లక్సర్ వైపు మళ్లించి హరిద్వార్‌కు పంపుతున్నారు. ఇన్నీ సహాయక చర్యలు చేపట్టినా.. హరిద్వార్‌లో రద్దీ తగ్గడం లేదు.