Kanpur: ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన కాన్పూర్ మేయర్..
- ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన కాన్పూర్ మేయర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ అధికారిపై ఆగ్రహంతో ఫైల్ విసిరిన ఘటన కాన్పూర్ లో జరిగింది. మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. ప్రభుత్వ అధికారిపై కోపంతో ఫైలు విసిరింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్ ప్రమీలా పాండే డ్రైనేజీ వ్యవస్థల పరిశుభ్రత, ఇతర సంబంధిత విషయాల గురించి కాన్పూర్ నగర్ నిగమ్ సమావేశానికి హాజరయ్యారు. డ్రెయిన్ క్లీనింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Bhadrachalam: గోదావరి వరదలు గుర్తు చేసిన భారీ వర్షం.. రామాలయం చుట్టూ చేరిన నీరు
Also Read
జోన్ 3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నానక్ చంద్ మార్చి నెలకు సంబంధించిన రిపోర్ట్ అందించగా.. మేయర్ కోపంతో ఫైలు విసిరారు. ఈసారి కాలువలు శుభ్రం చేయకపోతే.. పరిస్థితి వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఆ అధికారి మార్చి నెలకు సంబంధించిన రిపోర్ట్ జూన్ నెలదని చూపడంతో.. మేయర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అధికారులు పని చేస్తున్న తీరు చూస్తే తొంభై శాతం పనులు జరిగినట్లు కనిపించడం లేదని తెలిపారు. ఆరోగ్య, ఇంజినీరింగ్ శాఖలదే బాధ్యత కాబట్టి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
Penna Cement: అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్.. ఏకంగా 10,422 కోట్లకు కొనుగోలు..
రెండు నెలల క్రితమే డ్రైన్ క్లీనింగ్‌కు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాలువలు శుభ్రం లేవన్నారు. ఆక్రమణలను తొలగించే వరకు సరైన శుభ్రత సాధించలేమని ఆమె తెలిపారు. మరోవైపు.. స్థల పరిశీలనకు ఇంజనీర్లు గైర్హాజరు కావడం గమనార్హం. దీంతో మేయర్ పాండే మునిసిపల్ హెడ్ క్వార్టర్స్‌లో మొత్తం ఆరు జోన్ల ఇంజనీర్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంజనీర్లు ఎవరూ డ్రెయిన్ తనిఖీకి సంబంధించిన ఫోటోను చూపించలేదు. దీంతో.. ఆమెకు చిర్రెత్తిపోయి సహనం కోల్పోయింది.
- Tags
- angry
- Kanpur Mayor
- Meeting
- officer
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!