దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు గోవధపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ…
సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్‌రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.
UPSC పరీక్ష జూన్ 16 ఆదివారం జరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఘజియాబాద్‌లో ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు నమో భారత్ రైలును నడపాలని నిర్ణయించారు. రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) చుట్టూ ఉన్న కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 6 గంటల నుంచి నమో భారత్ రైలు సేవలను ప్రారంభించాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్ణయించింది.
టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఓపెనింగ్ జోడీని భారత్ కొనసాగించాలని లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 13, 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. వీరిద్దరూ తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఈ జోడీ మాత్రమే ఓపెనింగ్ చేయాలని…
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అమెరికాను ఓడించి సూపర్-8కి చేరింది. అయితే.. అమెరికా ఓటమితో సూపర్-8కి చేరుకోవాలన్న పాకిస్థాన్ ఆశలు సజీవంగానే మిగిలాయి. మరోవైపు.. ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంది. అయితే.. పాకిస్తాన్ జట్టు తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ఆటంకం కలిగేలా ఉంది. జూన్ 16న ఐపాకిస్థాన్ ఇప్పుడు జూన్ 16న ఐర్లాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు వర్ష గండం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ జరిగే ఫ్లోరిడాలో భారీ వర్షం కురుస్తుంది.…
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం టీ20 ప్రపంచ కప్ 2024 వేదికగా ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూయార్క్ లో క్రికెట్ స్టేడియం లేకపోవడంతో తాత్కలికంగా దీన్ని ఏర్పాటు చేశారు. 250 కోట్ల రూపాయలతో నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. అందరూ ఊహించినట్లుగానే ఇక్కడి పిచ్ బ్యాటర్లుకు పెద్దగా సహకరించలేదు. అయితే.. ఈ స్టేడియంలో బుధవారం జరిగిన ఇండియా-అమెరికా మ్యాచ్ చివరిది. ఆ తర్వాత ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు. స్టేడియంను కూల్చివేయడానికి బుల్డోజర్లు సిద్ధంగా ఉన్న వీడియోను ANI…
తెలంగాణ లాసెట్/ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల కోసం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మూడేళ్ల లా కోర్సు కోసం 36,079 మంది, ఐదేళ్ల లా కోర్సు కోసం 10,197 మంది, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 50,684 మంది అభ్యర్థులకు గాను.. 40,268 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో 72.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బ్రిటన్‌లో ఓ నర్సు దారుణ ఘటనకు పాల్పడుతుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులను చంపేస్తుంది. ఇంతకుముందు కూడా ఆ నర్సుపై పిల్లలను చంపుతున్న ఆరోపణలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. 2016 ఫిబ్రవరిలో వాయువ్య ఇంగ్లండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లో నెలలు నిండని నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. లూసీ లెట్బీ అనే నర్సు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో నవజాత శిశువును చంపడానికి ప్రయత్నించింది. దీంతో.. నర్సు లూసీ లెట్బీపై పిల్లలను…